డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. సినిమా థియేటర్లలో అధికారుల తనిఖీలు!
Tue May 27, 2025 21:25 Politics
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన ఆదేశాలతో అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. సినిమా హాళ్లలో తినుబండారాల అధిక ధరలు, నిర్వహణ లోపాలపై ఆయన దృష్టి సారించడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా కాకినాడలో ఈ తనిఖీల ప్రభావం స్పష్టంగా కనిపించింది. కాకినాడ సినిమా రోడ్డులో ఉన్న చాణక్య, చంద్రగుప్త థియేటర్లలో ఆర్డీవో, ఎమ్మార్వోలు, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పెద్దపూడి, కాజులూరు, తాళ్లరేవు, కరప, కాకినాడ, కాకినాడ రూరల్ ఎమ్మార్వోలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా మార్చి, ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సినిమా హాళ్ల బంద్ ప్రకటన నేపథ్యంలో, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తమ శాఖ చేపట్టిన చర్యలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పలు కీలక సూచనలు చేశారు.
ఇది కూడా చదవండి: కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
సినిమా హాళ్లలో టికెట్ ధర కంటే పాప్‌కార్న్, ఇతర తినుబండారాలు, శీతల పానీయాలు, చివరికి మంచినీళ్ల సీసాల ధరలు కూడా అధికంగా ఉండటంపై సమావేశంలో చర్చించారు. వీటి వాస్తవ ధరలు, ప్రస్తుత విక్రయ ధరలు, నాణ్యతా ప్రమాణాలను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, ధరల నియంత్రణ చేపట్టాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్‌లలో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలో గుత్తాధిపత్యం కొనసాగుతోందన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి ఆయన సూచించారు. కుటుంబ సమేతంగా సినిమాకు వచ్చే ప్రేక్షకులు తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి ఉండకూడదని పవన్ అభిప్రాయపడ్డారు. ధరలు అందుబాటులో ఉంటే ప్రేక్షకుల సంఖ్య పెరిగి, పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా మెరుగుపడుతుందని ఆయన అన్నారు. ఈ అంశంపై పన్నుల శాఖతో కూడా పరిశీలన చేయించాలని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి చేసిన ఈ సూచనల నేపథ్యంలోనే అధికారులు తక్షణమే రంగంలోకి దిగి థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్ 60 స్టైలస్.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..
టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..
ఏం అదృష్టం సార్..! అడ్డిమార్ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!
ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
లోకేశ్‌కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!
వల్లభనేని వంశీకి దెబ్బపై దెబ్బ.. బెయిల్ పిటిషన్ కొట్టివేత!
అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి షాక్! 14 రోజుల రిమాండ్..
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ!
వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!
కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్! రాష్ట్రానికి మరో 2 లక్షల కనెక్షన్లు!
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు! కొత్త ఆరోగ్య పథకం..
ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Pawankalyan #AndhraPradesh #APpolitics #APNews #Speech #Jagan #Anakapalli
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.